Services / పూజను బుక్ చేసుకోండి

చెల్లింపు చేయడానికి ముందు మమ్మల్ని సంప్రదించండి

Go Danam / గో దానం ( Donating Indian Sacred Cow )

అన్ని దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. గోదాన విశిష్టతను గాంగేయుడు ధర్మరాజుతో చెబుతాడు. తండ్రి ఔద్దాలకుడు ఇచ్చిన శాపం కారణంగా నచికేతుడు నరకానికి వెళ్తాడు. సశరీరంగా వచ్చిన నచికేతుడిని యమ ధర్మరాజు తగినిరీతిగా సత్కరించి అనేక పుణ్యలోకాలు చూపిస్తాడు. ఒకానొక లోకంలో దివ్య రూపాలతో ఉన్న కొందరిని చూసి నచికేతుడు యమధర్మరాజుతో వారంతా ఎవరని అడుగుతాడు. వారంతా భూ లోకంలో గోదానం చేసిన పుణ్యాత్ములు. గో దానం చేయడం వలన మహా భయానకమైన వైతరణి నదిని ఎలాంటి ప్రయాస లేకుండా దాటడమే కాకుండా ఇక్కడి గో లోకంలో పుణ్య ఫలాలను అనుభవిస్తూ, తమ వంశంలోని గడిచిన 10 తరాల పితృ దేవతలను తరింపజేస్తూ, రాబోయే 10 తరాల వారికి కామ్యములను ప్రసాదిస్తు ఇక్కడ ఎంతో ఆనందంగా ఉన్నారు అంటాడు. అంతటి ఉత్తమమైన గో దానం మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న చోట శాస్త్రోక్తంగా మేము ఆచరింపజేస్తాము.

Bank Details
Account.No:
50200082641402
Bank:
HDFC BANK
Branch:
MALLAPUR Branch
IFSC:
HDFC0004924